Fri Dec 20 2024 17:49:05 GMT+0000 (Coordinated Universal Time)
భార్యకు బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చిన బిచ్చగాడు
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు తన భార్యకు రూ.90,000 విలువైన మోపెడ్‌ను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు తన భార్యకు రూ.90,000 విలువైన మోపెడ్‌ను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ డబ్బును సేకరించి.. ఇప్పుడు ఆ వాహనం కొనుగోలు చేశాడు. ఈ సంఘటన అమరవార గ్రామంలో చోటు చేసుకుంది. సంతోష్ సాహు అనే వ్యక్తి దివ్యాంగుడు. అతను ట్రై సైకిల్లో కూర్చుని తన భార్య మున్నీ సాహుతో కలిసి భిక్షాటన చేస్తూ ఉండేవాడు. భర్త ట్రైసైకిల్ లో ఉండగా.. భార్య దాన్ని ముందుకు నెడుతూ ఉండేది. అధ్వాన్నమైన రోడ్లు, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇద్దరూ భిక్షాటన సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు. రోజంతా ట్రైసైకిల్ తోసుకుంటూ వెళ్లాల్సి రావడంతో అతని భార్య కూడా తరచూ అనారోగ్యం పాలవుతుండేది. ఇది చూసిన సంతోష్ మోపెడ్ కొనాలని నిర్ణయించుకున్నాడు.
గత కొన్నేళ్లుగా వాహనం కోసం డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. ఈ జంట ప్రతిరోజూ 300 నుండి 400 వరకు సంపాదిస్తూ ఉండేది. బస్టాండ్లు, దేవాలయాలు, మసీదుల వద్ద భిక్షాటన చేస్తూ ఉండేవారు. అలా మెల్లమెల్లగా రూ.90 వేల నగదు సేకరించి, చివరకు మోపెడ్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ దంపతులు మోపెడ్‌పై భిక్షాటన చేస్తున్నారు.
Next Story