Sun Dec 14 2025 23:35:04 GMT+0000 (Coordinated Universal Time)
కూటమితో కలవం.. మూడు రాష్ట్రాల్లో మేమే పోటీ చేస్తాం
బెంగాల్, అసోం, మేఘాలయలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు.

బెంగాల్, అసోం, మేఘాలయలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు. తాము కూటమిలో కలిసే ప్రసక్తి లేదని తెలిపారు. బెంగాల్లో కాంగ్రెస్ కు తమ పార్టీ ఐదు స్థానాలను కేటాయించిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు జరిగిందన్న వార్తలను ఎవరూ నమ్మవద్దని కూడా మమత బెనర్జీ చెప్పారు.
42 స్థానాల్లో...
కాంగ్రెస్ పోటీ చేసినా బెంగాల్ లో గెలిచే పరిస్థితి లేదని మమత అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో నలభైకి మించి సీట్లు రావని గతంలో మమత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాము ఒంటరిగానే బీజేపీని బెంాల్ లో ఓడిస్తామని, తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ లోని 42 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు.
Next Story

