Mon Dec 23 2024 10:15:48 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 16న భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈ నెల 16 వతేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈ నెల 16 వతేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను భగవంత్ మాన్ కలిశారు. ఆయన భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రి వర్గ సభ్యులపై కూడా ఆయన అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించినట్లు తెలిసింది.
13న రోడ్ షో....
కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ నెల 13వ తేదీన అమృత్సర్ లో అరవింద్ కేజ్రీవాల్ తో కలసి భగవంత్ మాన్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ రోడ్ షోలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తులు, మద్దతు దారులు పాల్గొనాలని భగవంత్ మాన్ కోరారు.
Next Story