Mon Dec 15 2025 04:03:24 GMT+0000 (Coordinated Universal Time)
Rajasthan : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రులుగా దియాకుమారి, ప్రేమచంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉప ముఖ్యమంత్రులు కూడా...
ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తొలిసారి ఆయన సీఎం అయ్యారు. నాలుగు సార్లు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కళాశాలలో చదివే రోజుల్లో ఏబీవీపీలో పనిచేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకున్న భజనలాల్ శర్మ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 48 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ కార్యక్రమానికి కేంద్రహోం మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, గోవా ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Next Story

