Mon Dec 23 2024 10:22:23 GMT+0000 (Coordinated Universal Time)
బీహార్ సీఎంకు షాకిచ్చిన బీజేపీ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది. మణిపూర్ లో జేడీయూ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంది. మణిపూర్ లో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలుండగా అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరిపోయారు. చేరిన వారు అధిక సంఖ్యలో ఉండటం, మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరడంతో మణిపూర్ లో బీజేపీలో జేడీయూ శాసనపక్షాన్ని విలీనం చేసింది.
ఐదుగురు ఎమ్మెల్యేలు...
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడ్డారు. గత ఎన్నికల్లో 38 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆరింటిలో ఐదుగురు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇటీవల బీహార్ లో బీజేపీని కాదని ఆర్జేడీ మద్దతుతో మరోసారి ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ పరిణామాలకు పోటీగా మణిపూర్ లో జేడీయూ పై బీజేపీ కసి తీర్చుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story