Mon Dec 15 2025 00:16:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ కీలక సమావేశం
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ వరస సమావేశాలను నిర్వహిస్తుంది

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ వరస సమావేశాలను నిర్వహిస్తుంది. ఈరోజు పార్టీ నేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జులతో పాటు కో ఇన్ఛార్జులు కూడా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని, ఆ యా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని జేపీ నడ్డా సూచించనున్నారు.
హాజరు కానున్న షా...
ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయి ఇన్ఛార్జులకు దిశానిర్దేశం చేసే అవకాశముంది. కొన్ని రాష్ట్రాల్లో పొత్తులతో వెళుతుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఒంటరిగానే వెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధపడుతున్న తరుణంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార వ్యూహాలను రచించుకోవాలని నేతలకు సూచించనున్నారు.
Next Story

