Fri Dec 20 2024 01:23:12 GMT+0000 (Coordinated Universal Time)
రెండు వందల కోట్ల ఆస్తి.. ఈ డబ్బు మాకొద్దు.. ప్రశాంతత కావాలంటూ?
రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు కాదనుకుని జైన సన్యాసులుగా మారారు గుజరాత్ కు చెందిన భావేష్ భండారీ దంపతులు
డబ్బు ప్రశాంతతను ఇవ్వదు. మనశ్శాంతిని దరిచేర్చదు. మనల్ని కుదుటుగా ఉండనివ్వదు. నిద్రపోనివ్వదు. ఆరోగ్య సమస్యలు.. ఇలా డబ్బుతో అనేక ఇబ్బందులు. కానీ డబ్బులు లేని వారు డబ్బులుంటే చాలు అనుకునే వారు 99 శాతం మంది ఉంటారు. సంపాదించే కొద్దీ ఇంకా డబ్బులు కావాలనే కునే వాళ్లు మనకు ఎక్కువగా కనపడతారు. పది కోట్లుంటే.. వందకోట్లు కావాలని.. వంద కోట్లు ఉంటే వేయి కోట్లు చేయాలని అనుకుని వారు అనేక మంది. ఈ డబ్బు సంపాదనలో పడి అడ్డదారులు తొక్కేవారు కూడా ఉన్నారు. అందుకే అనేక కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికే జైలులో ఊచలు లెక్కలు పెడుతున్న వారి గురించి విన్నాం. చూశాం. కానీ ఈరోజుల్లో డబ్బు వద్దనుకునే వారు మనకు వద్దు అనేకునే వారు మాత్రం అరుదుగా కనిపిస్తారు.
గుజరాత్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి...
అలాంటి అరుదైన జంట ఒకటి గుజరాత్ లో ఉంది. అవును... ఇది నిజం.. తమకున్న రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు కాదనుకుని సన్యసించడమే మంచిదని భావించారు ఆ భార్యాభర్తలు. తమ వద్ద ఉన్న రెండు వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చేశారు. జైన సన్యాసులుగా మారారు. గుజరాత్ కు చెందిన భావేష్ భండారీ, లేష్ దీక్ష దంపతులు సంపన్నులు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. వారిది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే ఈ డబ్బు మనకు ప్రశాతంత చేకూర్చ పెట్టలేదని భావించి మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని భావించారు. అందుకే యావదాస్తిని విరాళంగా ప్రకటించి తాము జైన సన్యాసులుగా మారిపోయారు.
పిల్లలు వదలి వెళ్లడంతో...
వారి పిల్లలు వీళ్లను వదిలి మూడేళ్ల క్రితం జైన సన్యాసులుగా మారిపోయారు. భవేష్ భాయ్ భండారీ దంపతులకు కుమారుడు విశ్వ ఉన్నాడు. అతని వయసు 19 ఏళ్లు. కుమార్తె భవ్య ఉన్నారు. ఆమె వయసు పదహారు. అయితే వారు ఇద్దరు జైన సన్యాసులుగా మారడంతో ఈ తల్లిదండ్రులకు కూడా తాము ఇంకా డబ్బు సంపాదించడం ఎవరికోసమని అనిపించినట్లుంది? అందుకే పిల్లల బాటలోనే సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22న కుటుంబ బాంధవ్యాలను తెంచుకునిన మరీ దేశమంతటా చెప్పులు లేకుండా, బిక్షాటన చేసి మరీ జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈనెల 22వ తేదీన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
దీక్ష తీసుకుంటే...
తమ నిర్ణయాన్ని సన్నిహితులకు తెలిపారు. వారంతా కలసి వీరిద్దరినీ ఊరేగించారు. తమ వద్ద ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్లతో సీటు పాటు అన్ని విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చాశారు. జైనమతంలో చేరి దీక్ష తీసుకుంటే ఇక భౌతిక సుఖాలన్నింటికీ దూరం. ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఇలా గతంలో అనేక మంది చేసి ఉన్నా ఈరోజుల్లో కూడా తమ యావదాస్తిని, ఇప్పటి వరకూ అనుభవించిన సర్వసుఖాలన్నింటినీ త్యజించడమంటే కరెన్సీ నోటు వారి కుటుంబంలో ఇక కనిపించదు. వారికి సంపాదించే అవసరం లేదు. కూడబెట్టుకునే ఆలోచనరాదు. డబ్బుతో పాటు ఆస్తి మొత్తాన్ని త్యజించి విరాళంగా ప్రకటించిన వారిని చూసైనా ఈ దోపిడీ చేసేవాళ్లకు కనువిప్పు కలుగుతుందుని ఆశిద్దాం.
Next Story