Mon Dec 23 2024 11:21:40 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మొదలుకానున్న కోమటి రెడ్డి 'యాత్ర'
ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే అధికారం లోకి రావడానికి ఆయా నేతలు యాత్రలు చేయడం సర్వ సాధారణం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 'యాత్ర' లకు మంచి పాపులారిటీ ఉంది. పాదయాత్రలు చేసిన ఎంతో మంది రాజకీయ నాయకులు పదవులను చేపట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా యాత్రల ట్రెండ్ నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ఉన్నారు. ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత కూడా పాదయాత్ర బాట పట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడుగుజాడల్లో భోంగీర్ ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న వెంకట్రెడ్డి మంగళవారం నాడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవిపై తాను ఆశలు పెట్టుకోవడం లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70-80 సీట్లు గెలుచుకోగలదని అన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు పూజలు చేశారు వెంకట్ రెడ్డి. అనుచరుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి అనుచరులు సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “కేవలం నినాదాలతో నేను ముఖ్యమంత్రిని కాలేను. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ ఎమ్మెల్యేలందరినీ సంప్రదించిన తర్వాత హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. నా ప్రాధాన్యత సీఎం పదవి కాదు ప్రజల సంక్షేమం. రాష్ట్ర సాధన కోసం నా మంత్రి పదవిని త్యాగం చేశాను" అని అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వస్తారని ఆయన తెలిపారు.
Next Story