Fri Dec 20 2024 18:40:15 GMT+0000 (Coordinated Universal Time)
సోనియాతో నేడు నితీష్, లాలూ భేటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నేడు భేటీ కానున్నారు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లు నేడు భేటీ కానున్నారు. ఇద్దరూ సోనియా గాంధీని కలవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఒకే తాటి మీదకు తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరగనుంది. జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో...
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించాలంటే అందరూ ఏకమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎవరికి వారు పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదు. అందుకే అందరినీ కలుపుకుని పోయి విపక్షాలన్నీ ఎన్నికలు ముందే పొత్తులు పెట్టుకోవాలన్న భావనతో నితీష్ కుమార్ ఉన్నారు. అందుకే సోనియాగాంధీతో వీరిరువురూ భేటీ కానున్నారు. వీరి సమావేశంలో బీహార్ రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
Next Story