Mon Dec 15 2025 04:06:40 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం నితీష్ పై దాడి
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఒక యువకుడు దాడి చేశాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఒక యువకుడు దాడి చేశాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత గ్రామమైన బఖ్తియార్పుర్ లోనే ఈ ఘటన జరగడం విశేషం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నా సమీపంలోని తన సొంత ఊరు అయిన బఖ్తియార్పుర్ లో షిల్భద్ర యాజీ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ చేస్తున్న సమయంలోనే శంకర్ కుమార్ వర్మ అనే యువకుడు వెనక నుంచి సీఎంపై దాడికి పాల్పడ్డారు.
మానసిక స్థితి.......
వెంటనే అప్రమత్తమయిన సీఎం భద్రతాసిబ్బంది శంకర్ కుమార్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి బాగా లేదని చెబుతున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వైద్య సాయం అందించాలని కోరారు. కాగా ముఖ్యమంత్రి భద్రతా వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story

