Fri Dec 20 2024 22:04:55 GMT+0000 (Coordinated Universal Time)
మరో సీఎంకు కరోనా
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో నితీష్ కుమార్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
వారం రోజుల నుంచి....
తనను వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాని నితీష్ కుమార్ కోరారు. బీహార్ లోనూ థర్డ్ వేవ్ ప్రారంభమయిందని ఇటీవల నితీష్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అధిక సంఖ్యలో కేసులు వస్తుండటంతో ఆంక్షలను కూడా కఠినతరం చేశారు.
Next Story