Sat Dec 21 2024 04:41:02 GMT+0000 (Coordinated Universal Time)
భార్యతో పరారైన ప్రియుడు.. ప్రియుడి భార్యను పెళ్లాడిన బాధితుడు
జిల్లాలోని ఛౌథామ్ బ్లాక్లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్.. నీరజ్ అనే వ్యక్తి భార్య రూబీతో పరారయ్యాడు.
టెక్నాలజీ పెరుగుతుందని, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ఎంత సంబరపడుతున్నామో.. అంతకు మించి చాలా దారుణాలు మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నాయి. పెళ్లయ్యాక.. చాలామంది అక్రమ సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు ఆడ, మగ తేడా లేదు. భర్త కాకుండా మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్న ఆడవాళ్లు ఉన్నారు. అలాగే ఇంట్లో కాపురం ఉంటూనే.. రెండు, మూడు సెటప్ లను మెయింటెన్ చేసే భర్తలూ ఉన్నారు. తమ సంబంధానికి అడ్డొస్తే.. జీవిత భాగస్వామిని అడ్డుతొలగించుకునేందుకు కూడా వెనుకాడట్లేదు.
తాజాగా బీహార్ లో జరిగిన ఓ ఘటన సరికొత్త చర్చకు తెరలేపింది. తన భార్యతో ఆమె ప్రియుడు పరారవ్వగా.. అందుకు ప్రతీకారంగా ప్రియుడి భార్యను పెళ్లాడాడు బాధిత భర్త. ఖగారియాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ల్లాలోని ఛౌథామ్ బ్లాక్లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్.. నీరజ్ అనే వ్యక్తి భార్య రూబీతో పరారయ్యాడు. వీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. వివాహం తర్వాత కూడా వారి మధ్య పరిచయం కొనసాగింది. ముకేశ్ కు కూడా మరో మహిళతో వివాహం జరిగింది. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లయినా.. వారి సంబంధాన్ని కొనసాగించారు. ముకేశ్ రోజువారీ కూలిగా పనిచేస్తుండగా, నీరజ్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ముకేశ్ తన ప్రియురాలు అయిన రూబీతో పరారై వివాహం చేసుకున్నాడు. తన ముగ్గురి పిల్లల్ని తీసుకుని రూబీతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై రూబీ భర్త నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు కూడా పంచాయితీ పెట్టి ముకేశ్ కు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు కానీ.. ముకేశ్ రూబీని వదిలి ఉండలేనని తేల్చిచెప్పాడు. ముఖేశ్ పై పగ పెంచుకున్న నీరజ్.. అతని భార్య రూబీ(ఆమె పేరు కూడా రూబీనే)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 18న ఆమెను స్థానిక ఆలయంలో వివాహం చేసుకుని, ముకేశ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు.
Next Story