Mon Nov 18 2024 11:44:41 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను హత్య చేశాడని భర్తకు జైలు శిక్ష విధించారు.. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏమిటంటే..!
ఈ ఘటనలో పెళ్లి-ప్రేమ-వివాహేతరసంబంధం-హత్య- జైలు శిక్ష లాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. చివరి ట్విస్ట్ కు మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే..!
ఎన్నో సినిమాల్లో ఊహించని ట్విస్ట్ లను మనం చూసి ఉంటాం.. కానీ కొన్ని కొన్ని సార్లు నిజ జీవితంలో కూడా చోటు చేసుకునే ట్విస్టులు మనకు షాక్ కు గురి చేస్తూ ఉంటాయి. అలాంటిదే ఓ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెళ్లి-ప్రేమ-వివాహేతరసంబంధం-
బీహార్‌లోని మోతిహారి జిల్లాలో చనిపోయినట్లు ప్రకటించబడిన ఒక మహిళ జలంధర్‌లో తన ప్రేమికుడితో కలిసి నివసిస్తున్నట్లు తేలింది. ఆమె 'హత్య' కేసులో.. ఆమె భర్త జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. శాంతి దేవి అనే మహిళ జూన్ 14, 2016న లక్ష్మీపూర్ నివాసి దినేష్ రామ్‌ని వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత శాంతి ఏప్రిల్ 19న తన భర్త ఇంటి నుంచి పారిపోయి పంజాబ్‌లోని తన ప్రియుడితో కలిసి జీవించడానికి వెళ్లింది. మహిళ అదృశ్యమైన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భర్త మీద వరకట్న వేధింపుల ఆరోపణలే కాకుండా.. అతను ఆమెను హత్య చేశాడని ఆరోపించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్టు చేసి హత్యానేరం కింద జైలుకు తరలించారు.
శాంతి తండ్రి యోగేంద్ర యాదవ్ పోలీసులతో మాట్లాడుతూ, "నా కుమార్తె దినేష్రామ్ను 2016లో వివాహం చేసుకుంది, అయితే ఏప్రిల్ 19 న, ఆమె ఎక్కడా కనిపించడం లేదని నాకు సమాచారం అందింది, అత్తారింటిలో వెతికినా కనిపించలేదు. అదే సంవత్సరం, అత్తమామలు మోటర్‌బైక్ మరియు రూ. 50,000 నగదు డిమాండ్ చేస్తూ నా కుమార్తెను కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు." అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దినేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుండి జైలు శిక్ష అనుభవిస్తూ వస్తున్నాడు భర్త.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇటీవల శాంతి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను కనుగొనమని సాంకేతిక బృందాన్ని కోరడంతో పెద్ద షాకింగ్ విషయమే బయటపడింది. సాంకేతిక నిఘా సహాయంతో, చనిపోయినట్లు ప్రకటించబడిన మహిళ వాస్తవానికి పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తన ప్రేమికుడితో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు బృందం వెళ్లి ఆ మహిళను మోతీహరికి తిరిగి తీసుకొచ్చారు.
- Tags
- bihar
- crime news
Next Story