Mon Dec 23 2024 12:40:03 GMT+0000 (Coordinated Universal Time)
బర్డ్ ఫ్లూ కలకలం.. 25 వేల కోళ్లను చంపేయాలని అధికారుల ఆదేశం
ఓ పౌల్ట్రీఫామ్ లో దాదాపు 100 కోళ్లు హఠాత్తుగా మృతి చెందాయి. దాంతో చనిపోయిన కోళ్ల నమూనాలను పూణేలోని ల్యాబ్ కు టెస్టింగ్ కు పంపగా..
ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుందని.. కాస్త ఉపశమనం పొందే లోపు.. ఏదొక వైరస్ మళ్లీ ఎక్కువవుతుంది. ఇప్పటివరకూ కరోనా వచ్చినవాళ్లందరూ ఎక్కువగా గుడ్లు, చికెన్ తినాలని, ఆ వేడికి వైరస్ త్వరగా చనిపోతుందని చెప్పారు. కానీ అవి లభించే కోళ్లకే వైరస్ వస్తే ఏం చేయాలి ? ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిల్లాడిన మహారాష్ట్రలో కోళ్ల పరిస్థితి ఇది. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఏం తింటే ఏం జబ్బులొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు అక్కడి ప్రజలు.
ఇటీవల థానే జిల్లాలోని ఓ పౌల్ట్రీఫామ్ లో దాదాపు 100 కోళ్లు హఠాత్తుగా మృతి చెందాయి. దాంతో చనిపోయిన కోళ్ల నమూనాలను పూణేలోని ల్యాబ్ కు టెస్టింగ్ కు పంపగా.. అక్కడ జరిపిన పరీక్షల్లో కోళ్లకు హెచ్ 5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) ఉందని తేలింది. దాని కారణంగానే కోళ్లు మృతి చెందాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు అక్కడి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వైరస్ గుర్తించిన కోళ్ల ఫామ్ ఉన్న ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటర్ పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. థానే జిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.
Next Story