Tue Nov 05 2024 16:20:13 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో తీవ్రతరమవుతోన్న బర్డ్ ఫ్లూ.. వేలసంఖ్యలో కోళ్లు మృతి
బర్డ్ ఫ్లూ రూపంలో ప్రజలను మరో వైరస్ బెంబేలెత్తిస్తోంది. చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు మహారాష్ట్ర వైద్య
కరోనా కోరల్లో చిక్కుకుని.. ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతోన్న దేశ ప్రజలకు మరో గండం ఎదురుకానుంది. బర్డ్ ఫ్లూ రూపంలో ప్రజలను మరో వైరస్ బెంబేలెత్తిస్తోంది. చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు మహారాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం థానే జిల్లా వరకే ఉన్న బర్డ్ ఫ్లూ.. ఇప్పుడు పాల్గర్ జిల్లాకు కూడా వ్యాపించింది. ఆ రెండు జిల్లాలోను బర్డ్ ఫ్లూ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. మరణించిన కోళ్ల అవశేషాలను పరీక్షించిన వైద్యాధికారులు.. H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగానే అవి మృతి చెందినట్లు నిర్థారించారు.
తొలుత థానే జిల్లాలోని వెహ్లెలి గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో 100 కు పైగా కోళ్లు చనిపోవడంతో.. వాటి అవశేషాలను పరీక్షించారు. బర్డ్ ఫ్లూ కారణంగా అవి చనిపోయాయని తేలడంతో.. ఆ పౌల్ట్రీ ఫారం నుంచి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న 25 వేల కోళ్లను వధించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలతో ఒక్క థానే జిల్లాలోనే 25,000 కోళ్లను పూడ్చిపెట్టారు యజమానులు. ఇక H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
Next Story