Mon Dec 23 2024 08:10:13 GMT+0000 (Coordinated Universal Time)
ఓడినా ఆయన మళ్లీ సీఎం
త్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి పుష్కర్ సింగ్ ధామిని నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి పుష్కర్ సింగ్ ధామిని నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దీంతో బీజేపీ శాసనసభ పక్షం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో 47 స్థానాలను బీజేపీ సాధించింది. మొత్తం 70 స్థానాలకు 47 స్థానాలను సాధించడం వెన పుష్కర్ సింగ్ ధామి శ్రమ ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించింది.
కేంద్ర నాయకత్వం....
అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. దీంతో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారని భావించారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఓటమి పాలయినా పుష్కర్ సింగ్ ధామినే తిరిగి ముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయించింది. దీంతో ఆయన త్వరలోనే సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్ లో జరిగే ప్రతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఓటమి పాలు కావడం సెంటిమెంట్ గా వస్తుంది.
Next Story