Fri Dec 20 2024 14:31:52 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో బీజేపీ ముందంజ
గుజరాత్ లో ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.
గుజరాత్ లో ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే ఏడోసారి కూడా బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం 129 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 45 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లోనే ముందంజలో ఉంది.
గత ఎన్నికల కంటే...
2017లో 99 స్థానాలను గెలిచిన కమలం పార్టీ ఈసారి అంతకంటే ఎక్కువగా ఈసారి స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ ఆధిక్యంలో దూసుకెళుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం హోరాహోరీ పోరు సాగుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ పోటా పోటీగా ముందంజలో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం రెండు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
Next Story