రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బుధవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. అభ్యర్థుల పేర్లపై కూడా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 39 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఛత్తీస్‌గఢ్‌లో కూడా 21 మందితో కూడాని అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో బీజేపీ ఐదుగురు చొప్పున మహిళలను కూడా చేర్చింది. మధ్యప్రదేశ్ నుంచి సరళ విజయేందర్ రావత్ (సబల్‌గఢ్), ప్రియాంక మీనా (చాచోడా), లలితా యాదవ్ (ఛతర్పూర్), అంచల్ సోంకర్ (జబల్పూర్ ఈస్ట్), నిర్మలా భూరియా (పేట్లావాడ్) కు సీట్లు దక్కాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ రాజ్వాడే (భట్గావ్), శకుంతలా సింగ్ పోర్తే (ప్రతాపూర్), సరళ కొసరియా (సరయ్పాలి), అల్కా చంద్రకర్ (ఖల్లారి), గీతా ఘాసి సాహు (ఖుజ్జీ)లకు పోటీ చేసే అవకాశం కల్పించింది.