Mon Dec 23 2024 07:55:07 GMT+0000 (Coordinated Universal Time)
BJP : పొత్తులపై నేడు నిర్ణయం తీసుకోనున్నారా?
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో వివిధ రాష్ట్రాలపై పొత్తుల గురించి నిర్ణయం తీసుకోనున్నారు
నేడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో వివిధ రాష్ట్రాలపై పొత్తుల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. భారతీయ జనతా పార్టీలో అతి ముఖ్యమైన పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులోనే అనేక రాష్ట్రాల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఏ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పొత్తుల వల్ల పార్టీకి లాభమా? నష్టమా? అన్నది ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పార్లమెంటరీ బోర్డు సమావేశంలో...
ఉత్తర భారతదేశంలో పార్టీకి కొంత ఊపు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలోనే బీజేపీకి అనుకున్నంత పట్టు లేదు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ ఓటమి పాలు కావడంతో అక్కడ జేడీఎస్తోనూ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అన్న దానిపై నేడు చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. నిన్నటి వరకూ పార్టీ జాతీయ సమావేశాలు జరిగాయి. ఈరోజు జరిగే అత్యంత కీలకమైన పార్లమెంటరీ సమావేశాల్లో పొత్తులపైనే నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story