Thu Mar 27 2025 07:45:33 GMT+0000 (Coordinated Universal Time)
BJP : మూడోసారి అధికారంలోకి బీజేపీ... ముఖ్యమంత్రి ఎవరంటే?
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం అరవై స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 46 స్థానాలు దక్కాయి

అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం అరవై స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 46 స్థానాలు దక్కాయి. పోలింగ్ కు ముందే పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు గెలవడంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్పీపీ ఐదు స్థానాలకు, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది చోట్ల విజయ సాధించారు. ఎన్నికలకు ముందే బీజేపీ గెలుపు దాదాపు గా ఖాయమయింది.
ఆయనే ముఖ్యమంత్రి ...
పది అసెంబ్లీ స్థానాలను గెలవడంతో బీజేపీదే గెలుపు అన్న అంచనాలు తొలి నుంచి వినిపించాయి. వరసగా అరుణాచల్ ప్రదేశ్ లో మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీనిపై మోదీ స్పందిస్తూ బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని అర్థమయిందని అన్నారు. రేపు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ పార్లమెంటరీ నిర్ణయించనుంది. ముఖ్యమంత్రి ఫెమా ఖండూనే కొనసాగించే అవకాశాలున్నాయి.
Next Story