Mon Dec 23 2024 10:25:26 GMT+0000 (Coordinated Universal Time)
కాబోయే రాష్ట్రపతి.. చీపురు పట్టి...?
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈరోజు ఒడిశాలోని శివాలయంలోకి వెళ్లారు. ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేశారు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. దీంతో ఆమె ఈరోజు తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని శివాలయంలోకి వెళ్లారు. ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని శుభ్రం చేసిన ద్రౌపది ముర్ము అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉన్న బలాన్ని బట్టి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఖాయం. అయినా ఆమె తాను నమ్మిన దేవుడిని మొక్కుకునేందుకు స్వయంగా గుడికి వెళ్లి ఆలయాన్ని శుభ్రపర్చడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనేక పదవులను....
ఒడిశా మంత్రిగా, ఎమ్మెల్యేగా, గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ద్రౌపది ముర్ము ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. తనకు ఇంత పెద్ద పదవి దక్కేందుకు కారణమైన శివాలయంలో ఆమె పూజలు నిర్వహించారు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని రాయరంగ్పూర్ శివాలయాన్ని ద్రౌపది ముర్ము శుభ్రం చేశారు. కాగా ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది.
Next Story