Tue Dec 24 2024 17:06:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బ్లాక్ బాక్స్ లభ్యం
తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ కు సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమయింది.
తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ కు సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆర్మీ బృందం ఈ బ్లాక్ బాక్స్ కోసం నిన్నటి నుంచి వెతుకుతుంది. అయితే పొగమంచు కారణంగా బ్లాక్ బాక్స్ దొరకడం కష్టంగా మారింది. అయితే చివరకు బ్లాక్ బాక్స్ లభ్యమవ్వడంతో దీనిని విశ్లేషించేందుకు అధికారులు ఢిల్లీకి తీసుకెళుతున్నారు.
కొద్ది దూరంలోనే...
ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే బ్లాక్ బాక్స్ లభ్యమయినట్లు సమాచారం. బ్లాక్ బాక్స్ దొరకడంతో ప్రమాదానికి కారణం తెలిసే అవకాశాలున్నాయి. హెలికాప్టర్ లో ఉన్న వారి చివరి మాటలు కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డు అయ్యే అవకాశాలున్నాయి.
Next Story