Tue Nov 05 2024 07:59:52 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
దేశంలో రెండు విమానాశ్రాయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్స్ పంపినట్లు తెలిసింది.
దేశంలో రెండు విమానాశ్రాయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్స్ పంపినట్లు తెలిసింది. అయితే మెయిల్స్ రావడంతో వెంటనే ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వడోదర, రాజ్ఖోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో వెంటనే భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
గాలింపు చర్యలు...
సీఆర్ఎస్ఎఫ్ బలగాలు కూడా విమానాశ్రయాల్లో అణువణువూ గాలించాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్స్ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి విచారించాలని నిర్ణయించారు. తరచూ బాంబు బెదిరింపులు విమానాశ్రయాలకు వస్తుండటంతో విమానాల రాకపోకలు ఆలస్యమై ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Next Story