Mon Dec 23 2024 19:39:58 GMT+0000 (Coordinated Universal Time)
టీసీఎస్ సంస్థలో భారీ స్కామ్
టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలు కోరుకునే వారి నుంచి సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లే డబ్బులు వసూలు చేశారని తేలింది. దాదాపు రూ
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో కుంభకోణం బయటకు వచ్చింది. ఉద్యోగాల కోసం లంచాలు తీసుకున్న కుంభకోణం బయటపడింది. కంపెనీలోని కొంతమంది సీనియర్ అధికారులు.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి స్టాఫింగ్ సంస్థల నుండి లంచాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కంపెనీ తన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (RMG) నుండి నలుగురు అధికారులను తొలగించింది. మూడు సంస్థలపై నిషేధం విధించింది.
టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలు కోరుకునే వారి నుంచి సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లే డబ్బులు వసూలు చేశారని తేలింది. దాదాపు రూ.100 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించారన్న సంగతి వెలుగు చూడటంతో టీసీఎస్ యాజమాన్యం చర్యలకు దిగింది. రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూపు (ఆర్ఎంజీ) లో పని చేస్తున్న నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను విధుల నుండి తప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ ఆర్ఎంజీ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లారు. మూడు నియామక సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. ఐటీ రంగ కంపెనీలు ‘క్యాంపస్ సెలక్షన్స్’ తోపాటు రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా కూడా ఐటీ ఇంజినీర్లను నియమించుకుంటాయి. దీని ఆసరాగా ఆర్ఎంజీ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి మూడు నియామక సంస్థల ద్వారా ఆశావాహులను నియమించుకున్నారని టీసీఎస్ సీఈఓ, సీఓఓలకు లేఖలు వెళ్లడంతో ఈ కుంభకోణం బయట పడింది. దీనిపై టీసీఎస్ యాజమాన్యం స్పందించి త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించింది. ఇందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్ కూడా భాగస్వామిగా ఉన్నారు. టీసీఎస్‌కు వివిధ సేవలు అందించే కాంట్రాక్టర్లతోపాటు మూడు లక్షల మందిని ఒక ఎగ్జిక్యూటివ్ గత మూడేళ్లలో నియమించారని తేలింది. ఈ నియామకాల్లో కనీసం రూ.100 కోట్ల ముడుపులు కమిషన్ రూపంలో సంపాదించి ఉంటారని సమాచారం. ఉద్యోగుల రిఫరల్ ప్రోగ్రామ్‌లు, స్టాఫింగ్ సంస్థల ద్వారా IT కంపెనీల కోసం ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటారు. స్టాఫింగ్ సంస్థలు కంపెనీకి అభ్యర్థుల జాబితాలను అందజేస్తాయి, ఆ తర్వాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అవసరాన్ని బట్టి వారిని నియమించుకుంటాయి.
Next Story