Mon Dec 23 2024 23:13:53 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రంతా మద్యంమత్తులో ఉన్న వరుడు.. ఉదయానికి తేరుకుని చూస్తే..
బంధుమిత్రులతో పెళ్లిమండపం కోలాహలంగా ఉంది. కానీ పెళ్లికొడుకు మాత్రం ముహూర్తం దగ్గరకు పడుతున్నా..
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు మద్యపానం కారణంగా ఆగిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. మద్యం మత్తులో మండపంలోనే వరుడు నిద్రపోవడం, వధువుతరపు వారితో గొడవలు, తాళికట్టేవేళ ఫుల్లుగా మద్యం తాగడం.. ఇలాంటి కారణాలతో చాలా పెళ్లిళ్లు రద్దయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. ఫుల్లుగా మందుకొట్టిన వరుడు మండపానికి వెళ్లడం మర్చిపోయాడు. అతనికోసం ఎదురుచూసి చూసీ.. విసిగిపోయిన వధువు వివాహాన్ని రద్దుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని భాగల్పూర్ కు చెందిన మియాన్ కు సుల్తాన్గంజ్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. సోమవారం(మార్చి13) రాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి వధువు తరపువారు ఘనంగా ఏర్పాట్లు చేశారు చుట్టాలంతా వచ్చేశారు. బంధుమిత్రులతో పెళ్లిమండపం కోలాహలంగా ఉంది. కానీ పెళ్లికొడుకు మాత్రం ముహూర్తం దగ్గరకు పడుతున్నా అంతులేడు. దాంతో అందరూ ఏమైందోనని ఆందోళన చెందారు. తీరాచూస్తే అతను మద్యం మత్తులో మునిగిపోయి.. తనకు పెళ్లి ఉందన్న విషయాన్నే మరచిపోయాడని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. విసిగిపోయిన వధువు, కుటుంబ సభ్యులు మండపం నుంచి వెళ్లిపోయారు.
రాత్రంతా మద్యం మత్తులో మునిగిన వరుడు మియాన్కు తెల్లారాక తన పెళ్లి విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆగమేఘాల మీద వధువు ఇంటికి చేరుకున్నాడు. తప్పైపోయిందని చెప్పే ప్రయత్నం చేయగా.. తీవ్ర కోపంగా ఉన్న వధువు.. నీతో నాకు పెళ్లొద్దు అని తెగేసి చెప్పేసింది. మియాన్ను, అతడితో వచ్చిన వారిని పట్టుకుని బంధించి పెళ్లి కోసం చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా.. అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేదు. వధువు తనకీ పెళ్లి వద్దని ససేమిరా చెప్పడంతో.. చేసేదిలేక వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
Next Story