Sun Dec 22 2024 22:36:25 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లింట చిచ్చురేపిన మద్యం.. మొత్తానికి పెళ్లే ఆగిపోయింది !
ఫుల్లుగా మందుకొట్టి.. మద్యం మత్తులో ఊగిపోతూ.. ఒళ్లు తెలీకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో పెళ్లికూతురు దిగ్భ్రాంతికి
ఓ పెళ్లింట మద్యం చిచ్చురేపింది. ఆఖరికి జరగాల్సిన పెళ్లి.. ఆగిపోయింది. వధువు వరుడిని ఛీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురానికి చెందిన లక్ష్మీనరసింహన్ కు, చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. సోమవారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆదివారం రాత్రి వధూవరుల కుటుంబాలు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కల్యాణ మండపంలో జరిగిన విందులో పెళ్లికొడుకు కంట్రోల్ తప్పాడు.
ఫుల్లుగా మందుకొట్టి.. మద్యం మత్తులో ఊగిపోతూ.. ఒళ్లు తెలీకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో పెళ్లికూతురు దిగ్భ్రాంతికి గురైంది. ఇంత జరిగినా ఇంకా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే.. తన జీవితాన్ని తానే చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుందని భావించి.. తనకీ పెళ్లి వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెళ్లి విందు మధ్యలోనే ఆగిపోయింది. వరుడు చేసిన నిర్వాకానికి ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లికూతురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కల్యాణ మండపానికి వెళ్లి చూడగా.. వరుడు తప్పతాగిన స్థితిలో కనిపించాడు. అందుకే తాము పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని, ముందుగా వరుడికి ఇచ్చిన బంగారు గొలుసు, ఉంగరం, బంగారపు వాచీని వెనక్కి తీసుకున్నారు.
Next Story