Fri Mar 28 2025 21:14:21 GMT+0000 (Coordinated Universal Time)
కుక్కను బండికి కట్టి ఈడ్చుకెళ్లి...?
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది. ఇస్మాయిల్ అనే వ్యక్తి కుక్కను బైక్ కు కట్టుకుని వెళ్లాడు.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది. ఇస్మాయిల్ అనే వ్యక్తి కుక్కను బైక్ కు కట్టుకుని వెళ్లాడు. దాదాపు కిలో మీటర్ వరకూ వెళ్లాడు. అయితే స్థానికులు గమనించి ఇస్మాయిల్ ను ఆపడంతో తప్పయి పోయిందని ప్రాధేయపడినా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జంతుహింస చట్టం కింద...
ఘజియాబాద్ జిల్లాలోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇస్మాయిల్ కుక్కను బైకు వెనక కట్టి ఈడ్చుకెళుతుండగా స్థానికులు గమనించి ఆపారు. అతను ఆగకపోవడంతో వెంబడించి మరీ ఇస్మాయిన్ల ను పట్టుకున్నారు. పోలీసులు అతనిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. తమ ప్రాంతంలో ఈ కుక్క చాలా మందిని కరవడం వల్లనే తాను ఇలా తీసుకెళుతున్నానని పోలీసులకు ఇస్మాయిల్ చెప్పాడు. ఐదుగురిని కరిచి గాయపరిచిందని కూడా తెలిపాడు.
Next Story