Mon Dec 23 2024 17:57:27 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దులో సొరంగం.. ఉగ్రవాదుల కుట్రే !
ప్రతి సారీ అమరనాథ్ యాత్రను అడ్డుకోవాలని పాక్ ఏదోరకంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూవస్తోంది. వాటిని భారత్ తిప్పికొడుతూ..
జమ్ము : పాకిస్తాన్ ఏదో రకంగా భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్ నుంచి భారత్ కు ఉగ్రముప్పు పొంచి ఉందని జగమెరిగిన సత్యం. అయితే పాక్ ను ఎప్పటికీ నమ్మే ప్రసక్తే లేదని భారత్ ఎన్నోసందర్భాల్లో తేల్చి చెప్పింది. దేశంలో అమరనాథ్ యాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాత్ర హిందువులకు ఎంతో ప్రత్యేకమైదని, పవిత్రమైంది కూడా. జీవితంలో ఒకసారైనా అమరనాథ్ యాత్ర చేస్తే జన్మధన్యమవుతుందని కాంక్షించని హిందువులుండరు అంటే అతిశయోక్తి లేదు. ఈ యాత్ర క్లిష్టతరమైనది, ఎన్నోఅవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ మధ్య పాక్ ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉందని విశ్వసనీయ సమచారం.
ప్రతి సారీ అమరనాథ్ యాత్రను అడ్డుకోవాలని పాక్ ఏదోరకంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూవస్తోంది. వాటిని భారత్ తిప్పికొడుతూ వస్తుంది. ఈసారి కూడా పాక్ తన వక్రపుద్ధిని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఏకంగా సరిహద్దుల్లో సొరంగాన్నే తవ్వేశారు. అయితే భారత్ సైతం అమరనాథ్ యాత్రకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా పెట్టింది. భారత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బీఎస్ఎఫ్ సంస్థ నిరంతర నిఘాలో భాగంగా జమ్ములోని సాంబా జిల్లాలో వాక్ ఫఖీరా సరిహద్దు చెక్ పోస్టు వద్ద 150 అడుగుల సొరంగాన్ని గుర్తించింది. పాక్ నుంచి భారత్లోకి చొరబడేందుకే ఈ సొరంగం తవ్వబడినట్లు ఆ సంస్థ గుర్తించింది. పాక్ ఈ సొరంగం ద్వారా ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు.
పాక్ ఏదోరకంగా సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు ఈ సొరంగం కంటపడింది. మొదట్లో ఇది స్థానికులు చేసిన సొరంగమని భావించారు. అయితే, ఈ సొరంగం ఆవలి వైపున పాక్ భూభాగం ఉన్నట్టు గుర్తించిన తర్వాత బీఎస్ఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేశారు. సరిగ్గా ఐదేళ్ళ క్రితం అమరనాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ యాత్రపై భద్రతాదళాలు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అమరనాథ యాత్ర జూన్ 30వ తేదీన ప్రారంభంకానుంది. ఈ ఏడాది ఇప్పటి నుంచే భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు.
Next Story