Sun Dec 22 2024 08:05:09 GMT+0000 (Coordinated Universal Time)
Budget cheaper list: భారీగా తగ్గనున్న మొబైల్స్, బంగారం, వెండి ధరలు
బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా లభించనున్నాయి. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయించారు. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇ-కామర్స్‌పై TDS రేటు 1 శాతం నుండి 0.1 శాతానికి తగ్గింపు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించబడింది.
అమ్మోనియం నైట్రేట్పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి.. బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. కొత్త పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులకు ₹50,000 నుండి ₹75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది.
Next Story