Tue Nov 05 2024 10:51:40 GMT+0000 (Coordinated Universal Time)
Good News: నిరుద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని తెలిపింది. అంతేకాకుండా.. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల యువతకు ఉపాధి, నైపుణ్యం పెంపు కోసం రూ.2 లక్షల కోట్లతో ప్యాకేజీలను తీసుకురాబోతున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం బడ్జెట్ లో రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు ఉంటుందని తెలిపారు. ఈ పథకాల ద్వారా 2.10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు.
Next Story