Mon Mar 31 2025 10:15:57 GMT+0000 (Coordinated Universal Time)
31న రాష్ట్రపతి ప్రసంగం.. బడ్జెట్ సమావేశాలకు రెడీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఆరోజు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆర్థిక సర్వేను, శనివారం కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ఉభయ సభలు వచ్చే సోమవారం చర్చించనున్నాయి.
రెండు వర్గాలు...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరనున్నారు. సభను సజావుగా సాగేలా వ్యవహరించాలని అభ్యర్థించనున్నారు. మరో వైపు కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమికి చెందిన పార్టీలు ప్రభుత్వ నిర్ణయాలను సభ ద్వారా ప్రశ్నించేందుకు సిద్ధమయింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికారపార్టీ రెడీ అయింది.
Next Story