Fri Dec 20 2024 10:48:42 GMT+0000 (Coordinated Universal Time)
Kerala Lottery : లక్కీ లాటరీ.. అయ్యప్ప సన్నిధికి వెళితే... ఇరవై కోట్లు సొంతమయింది
శబరిమల యాత్రకు అయ్యప్ప దర్శనానికి వెళ్లి లాటరీ టిక్కెట్ కొంటే కోటీశ్వరుడయ్యాడు పుదుచ్చేరికి చెందిన ఒక వ్యాపారి
Kerala Lottery :అదృష్టమంటే అతనిదే.. శబరిమల యాత్రకు అయ్యప్ప దర్శనానికి వెళ్లి లాటరీ టిక్కెట్ కొంటే కోటీశ్వరుడయ్యాడు. పుదుచ్చేరికి చెందిన రైతుకు కేరళకు చెందిన లాటరీలో ఇరవై కోట్లు ప్రైజ్ మనీ లభించింది. కేవలం నాలుగు వందల రూపాయలతో లాటరీ టిక్కెట్ కొన్న ఆయనకు కేరళలో అతిపెద్ద ప్రైజమనీ గా ఉన్న లాటరీ అతని సొంత మయింది. శబరిమలకు చెందిన పుదుచ్చేరికి చెందిన వ్యాపారి సరదాగా ఒక లాటరీ టిక్కెట్ కొన్నాడు. నాలుగు వందల రూపాయలు వేస్ట్ ఎందుకని భావించలేదు.
వివరాలను గోప్యంగా ఉంచాాలని..
కానీ ఆ టిక్కెట్ అతని ఇంటి తలుపును అదృష్టం తట్టింది. XC 224091 నెంబరు గల లాటరీ టిక్కెట్ కు ప్రైజ్ మనీ వచ్చినట్లు తెలియగానే ఆ వ్యక్తి సంబరపడిపోయాడు. వెంటనే ఆ టిక్కెట్ తో పాటు తగిన ఆధారాలను తీసుకు వస్తే లాటరీ సొమ్మును చెల్లిస్తామని చెప్పాడు. అయితే అతని వివరాలు మాత్రం భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు. ఇరవై కోట్ల లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఆ వ్యక్తికి పన్నులు పోను పన్నెండు కోట్లు రానున్నాయి. అది కదా అదృష్టమంటే. కానీ లాటరీ పిచ్చిలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి.
Next Story