Fri Dec 20 2024 16:45:58 GMT+0000 (Coordinated Universal Time)
10వ తేదీన 13 స్థానాలకు ఉపఎన్నికలు
ఈనెల 10న దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి
ఈనెల 10న దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో వీటిని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
వివిధ రాష్ట్రాల్లో...
ఉప ఎన్నికలు జరిగే స్థానాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది పశ్చిమ బెంగాల్లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్ లో మూడు, ఉత్తరాఖండ్ లో రెండు, బీహార్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో శాసనసభ స్థానానికి, ఎంపీలో 1 స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఫలితాలను ఈ నెల 13న వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
Next Story