Mon Dec 23 2024 16:57:31 GMT+0000 (Coordinated Universal Time)
ఉపఎన్నికల ఫలితాలు: బీజేపీని భారీగా దెబ్బకొట్టిన ఇండియా కూటమి
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని షాక్
అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. ఉపఎన్నికలు జరిగిన 13 సీట్లలో పది స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష ఇండియా కూటమి అధికార ఎన్‌డిఎను చిత్తు చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు చేరుకోవడంలో విఫలమమైన ఎన్.డి.ఏ. కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది.
బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మొత్తం నాలుగు స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ గెలిచారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో రెండింటిని గెలుచుకుంది. ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్, మంగళూర్ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) త్రిముఖ పోటీలో జలంధర్ పశ్చిమ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) దక్కించుకుంది.
పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మధుపూర్ణ ఠాకూర్, ముకుత్ మణి అధికారి, కృష్ణ కళ్యాణి, సుప్తి పాండేలు.. బాగ్దా, రానాఘాట్, రాయ్‌గంజ్, మానిక్తలాలో భారీ మెజారిటీతో గెలుపొందారు. తృణమూల్ రాజ్యసభ ఎంపీ మమతాబాలా ఠాకూర్ కుమార్తె మధుపర్ణ (25) బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించింది.
Next Story