Fri Dec 20 2024 19:23:45 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో ఘోర ప్రమాదం.. కూలిన కేబుల్ బ్రిడ్జి, 400 మంది గల్లంతు
మోర్బీ ప్రాంతంలో మచ్చునదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో.. నదిలో 400 మందికి పైగా..
ప్రధాని మోదీ ఇలాకా అయిన గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ ప్రాంతంలో మచ్చునదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో.. నదిలో 400 మందికి పైగా గల్లంతయ్యారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న వారంతా అమాంతం నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పౌర, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story