Tue Dec 17 2024 06:54:37 GMT+0000 (Coordinated Universal Time)
చలో ఢిల్లీకి రెండు రోజుల విరామం
రైతులు పిలుపు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు
రైతులు పిలుపు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో పాటు నిన్న పోలీసులు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంతో రెండు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఖనౌరీ వద్ద రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి. శంభు సరిహద్దు వద్ద భాష్పవాయువును ప్రయోగించారు. ఈ సందర్బంగా పన్నెండు మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చలో ఢిల్లీని రెండు రోజుల పాటు రైతు సంఘాలు వాయిదా వేశాయి. తమ భవిష్యత్ ప్రణాళికను రేపు ప్రకటించనున్నాయి.
ఘర్షణలతో టెన్షన్...
అయితే అప్పటి వరకూ ఖరౌరీ, శంభు సరిహద్దుల్లోనే రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. మరోవైపు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ ఇక్కడి నుంచి కదలబోమని రైతులు ప్రకటించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. నాలుగు దఫాలుగా చర్చలు జరిపినా ఫలవంతం కాలేదు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకుంటుండటంతో ఈ ప్రాంతం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story