Sun Nov 17 2024 22:01:51 GMT+0000 (Coordinated Universal Time)
కూతతో విసిగిస్తోన్న కోడి..పోలీస్ స్టేషన్లో వైద్యుడి ఫిర్యాదు..చివరికి ఏమైందంటే..
నిద్రపోయే సరికి లేట్ అవ్వడంతో.. ఉదయాన్నే నిద్రలేవడం కుదరని పని. కానీ.. తన ఇంటికి సమీపంలోని వందన విజయన్..
మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తన ఇంటిపక్కన ఉంటున్న కోడి కూతకూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందంటూ ఓ వైద్యుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అలోక్ మోడీ అనే వ్యక్తి ఇండోర్ పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆస్పత్రి సమీపంలో ఉన్న సిల్వర్ ఎన్ క్లేవ్స్ లో నివాసముంటున్నాడు. వృత్తి రీత్యా క్యాన్సర్ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్లను ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అర్థరాత్రి అవుతుంది.
నిద్రపోయే సరికి లేట్ అవ్వడంతో.. ఉదయాన్నే నిద్రలేవడం కుదరని పని. కానీ.. తన ఇంటికి సమీపంలోని వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన కోడి మాత్రం అలోక్ ను నిద్రపోనివ్వదు. రోజూ తెల్లవారుజామున ఆపు లేకుండా కూతకూస్తూ.. నిద్రకు భంగం కలిగించేది. ఇదే విషయాన్ని అతను విజయన్కు పలుమార్లు చెప్పాడు. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాలేదు. కోడీ మళ్లీ అలానే కూయడంతో విసిగుచెందిన మోడీ.. పాలసియా పోలీసులను ఆశ్రయించాడు.
తన ఇంటికి సమీపంలో ఉన్న కోడి తన కూతతో నిద్రాభంగం కలిగిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. రోజంతా ఆసుపత్రిలో బిజీగా ఉండి.. అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్న తనను కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలోక్ ఫిర్యాదు మేరకు కోడి యజమాని అయిన వందన విజయన్ పై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Next Story