Sun Apr 06 2025 22:02:15 GMT+0000 (Coordinated Universal Time)
Rahulh Gandhi : రాహుల్ గాంధీపై కేసు నమోదు
పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది

పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు. నిన్న పార్లమెంటు ఆవరణలో జరిగిన దాడిలో రాహుల్ గాంధీ ఉన్నారని బీజేపీ ఎంపీలు చేసిన ఫిర్యాదుతో పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై కేసు నమోదయింది.
నేరపూరితంగా వ్యవహరించారని...
రాహుల్ గాంధీ నేరపూరితంగా వ్యవహరించడమే కాకుండా, తన అనుచరులతో దాడికి దిగారని పలు సెక్షన్లు ఆయనపై నమోదు చేశారు. ఈరోజు రాహుల్ గాంధీని పోలీసులు ఈ కేసు విషయంలో విచారణ చేసే అవకాశముంది. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన తోపులాటలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ పై కేసు నమోదయింది. నేటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈరోజు ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App
Next Story