Thu Dec 26 2024 01:53:31 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : కరోనా పోయినట్లేనా.. నెలన్నర ఊపి మళ్లీ కనిపించకుండా పోయిందే?
కరోనా వైరస్ కేసులు దేశంలో తగ్గుముఖంపట్టినట్లేనని అంటున్నారు. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అప్డేట్ లేదు
అవును కరోనా వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించడం లేదు. జెఎన్ 1 వేరియంట్ దూసుకు వస్తుందంటూ ప్రజలను భయపెట్టారు. ప్రధానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జెఎన్ 1 వేరియంట్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సయితం గణాంకాలు ప్రతి రోజూ ప్రజల ముందు ఉంచింది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని కూడా వైద్య నిపుణులు హెచ్చరించారు.
జేన్ 1 వేరియంట్ అంటూ...
జెఎన్ 1 వేరియంట్ కేసులు కూడా దేశంలో వేల సంఖ్యలోనే నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా రోజుకు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకూ నమోదవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పండగల సీజన్ కావడంతో మరింత వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్లను ధరించడం, శానిటైజర్ ల వాడకం వంటివి చేయాలంటూ హెచ్చరికలు పదే పదే చెవుల్లో వినిపించాయి.
అయితే అప్డేట్ ప్రకారం...
ఇక టీవీల్లో అయితే కరోనా అంటూ ఊదరగొట్టేశారు. కరోనా మరోసారి విలయతాండవం చేస్తుందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అప్డేట్ కనిపించడం లేదు. అంటే కరోనా వైరస్ కేసులు తగ్గినట్లా? లేక కనిపించకుండా పోయిందా? అన్న అనుమానాలు ప్రజల్లో అనుమానం బయలుదేరింది. ప్రతి ఏడాది నవంబరు నుంచి జనవరి వరకూ కరోనా అంటూ భయపెట్టడం అలవాటుగా మారిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కానీ జనవరి 26న దేశంలో 182 కోవిడ్ కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. అలాగే కేరళలో కరోనా కారణంగా ఒకరు మరణించినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1525 ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా కేరళలో 103 కేసులున్నట్లు చెబుతున్నారు.
Next Story