Mon Dec 23 2024 12:37:18 GMT+0000 (Coordinated Universal Time)
లాలూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అలా చేశారని ఆరోపణలు
దాణా కుంభకోణంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇటీవలే బెయిల్ లభించగా.. తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది.
దాణా కుంభకోణంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇటీవలే బెయిల్ లభించగా.. తాజాగా సీబీఐ మరో కేసు నమోదుచేసింది. 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీలో అవకతకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో లాలూ ఆయన కుటుంబసభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ కుటుంబసభ్యుల నివాసాలు సహా 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టారు. లాలూ, అతని కుమార్తెలు అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో సీబీఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. ఉద్యోగార్థులు కావాలని వచ్చిన వారి నుంచి స్థలాలు, భూములను తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే లాలూపై సీబీఐ కేసు నమోదు చేసింది.
రైల్వే జాబ్స్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బంది శుక్రవారం ఉదయాన్నే లాలూ ప్రసాద్, ఆయన భార్యా, కుమార్తె నివాసాలతోపాటు ఢిల్లీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో 17 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
రూ. 139 కోట్ల డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత 73 సీనియర్ నాయకుడు గత నెలలో జైలు నుండి బయటకు వచ్చారు. ఇలా ఎన్నో కేసులతో లాలూ ప్రసాద్ యాదవ్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండగా.. తాజాగా సీబీఐ రైడ్స్ ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి.
News Summary - CBI's New Corruption Case Against Lalu Yadav, Family Members, Searches On
Next Story