Sat Dec 21 2024 00:21:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కోర్టుకు సిసోడియా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం సిసోడియాను స్పెషల్ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు. ఈ స్కామ్ లో వారం రోజుల పాటు మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు.
సీబీఐ కస్టడీ...
అనేక రకాలుగా ఈ కేసులో సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు సమాచారాన్ని సేకరించింది. అయితే కోర్టు ఇచ్చిన కస్టడీతో ముగియడంతో నేడు కోర్టులో తిరిగి ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ శుక్రవారం స్పెషల్ కోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది.
Next Story