Tue Dec 24 2024 18:23:00 GMT+0000 (Coordinated Universal Time)
మనీష్ సిసోడియాకు లుక్అవుట్ నోటీసులు
లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడ్డారన్న దానిపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది
లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 13 మంది పై కూడా సీబీఐ లుక్ అవుట్ నోటీసులను ఈరోజు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దేశం విడిచి పారి పోకుండా...
ఈ పథ్నాలుగు మంది దేశం విడిచి పారి పోకుండా సీబీఐ ముందస్తుగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ షరతులు ఉల్లంఘిస్తే వారిని అదుపులోకి తీసుకునే వీలుంది. అయితే ఈ లిక్కర్ స్కాంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
Next Story