Mon Dec 23 2024 08:20:52 GMT+0000 (Coordinated Universal Time)
విజృంభిస్తోన్న కరోనా.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని తెలిపింది. H3N2 ఇన్ ఫ్లుయెంజా వ్యాధులు కూడా పెరుగుతున్నాయన్న..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో గత 24 గంటల్లో 1590 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆయా రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అయితే.. కేసులు పెరుగుతున్నా పెద్దగా ఆందోళన కలిగించే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని తెలిపింది. H3N2 ఇన్ ఫ్లుయెంజా వ్యాధులు కూడా పెరుగుతున్నాయన్న కేంద్రం.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది. గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.
Next Story