Mon Dec 23 2024 07:48:21 GMT+0000 (Coordinated Universal Time)
India : ఇకపై ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయి ఉండాల్సిందే.. అప్పుడే నగదు బదిలీ
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు జమ చేయాలంటే బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబరుఅనుసంధానం కావాల్సిందేనని కేంద్రం తేల్చింది
కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు జమ చేయాలంటే బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబరుతో అనుసంధానం కావాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు అందించే మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకుల్లోనే జమ చేయనున్నారు. ఇందులో మరో ఆప్షన్ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది.దేశంలో నిరుపేదలను ఆదుకునేందుకు మహాత్మాగాంధీ ఆతీచ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
నిధులు పక్కదారి పడుతున్నాయని...
అయితే ఇప్పటి వరకూ ఈ పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పనులలో కూలీలుగా పనిచేసిన వారికి నగదును నేరుగా అందిస్తుంది. ఏటా లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ కార్మికులకు ఉపాధి కల్పించే కార్యక్రమం పక్క దారి పడుతుందని భావించిన కేంద్రం అందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే ఇలా అనుసంధానంపై ప్రతిపక్షాలు లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికేనని విమర్శలు చేస్తున్నా నిధులు పక్కదారి పట్టకుండా ఉండటానికేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది
అనుసంధానం చేస్తేనే...
ఇప్పటి వరకూ దేవంలో 25.89 కోట్ల మంది ఈ పథకం కింద కూలీలుగా నమోదు చేసుకున్నారు. అయితే ఆధార్ నెంబరుతో బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారు కేవలం 13.49 కోట్ల రూపాయలు మాత్రమే. దీనిని సాకుగా చూపిన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పక్కదారి పట్టిస్తున్నాయని భావిస్తుంది. అందుకోసమే ఈ పథకం కింద ఇక నేరుగా నిధులను కూలీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. డిసెంబరు 31వ తేదీతో ఆధార్ తో బ్యాంకు ఖాతాను అనుసంధించుకోవాల్సిన గడువు ముగియడంతో ఇకపై ఆధార్ తో అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే ఈ పథకం కింద నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Next Story