Sun Nov 17 2024 23:37:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ, తెలంగాణలకు షాక్ ఇచ్చిన కేంద్రం
విద్యుత్తు బకాయీలు చెల్లించకపోవడంతో కేంద్రం షరతు విధించింది. బయట నుంచి విద్యుత్తు కొనుగోలుపై కేంద్రం నిషేధం విధించింది.
విద్యుత్తు బకాయీలు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. బయట నుంచి విద్యుత్తు ను కొనుగోలు చేయడం పై కేంద్రం నిషేధం విధించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలపై కూడా ఈ నిషేధం విధించింది. దీంతో పదమూడు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముంది. బకాయీలు చెల్లించనందున కేంద్రం 13 రాష్ట్రాలపై ఈ నిషేధం విధించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్, పవర్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ పవర్ ఎక్సేంజ్ లను పవర్ ట్రేడింగ్ ను నిషేధించాలని కోరింది.
13 రాష్ట్రాలకు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణా రాష్ట్రం 1380 కోట్లు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ 412 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పదమూడు రాష్ట్రాల డిస్కమ్ లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. బకాయీలు చెల్లించకపోతే బయట మార్కెట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడానికి వీలులేదు. దీంతో ఆ యా రాష్ట్రాల్లో విద్యుత్తు సంక్షోభం ఏర్పడుతుంది.
Next Story