Sun Nov 17 2024 19:28:11 GMT+0000 (Coordinated Universal Time)
మంకీ పాక్స్‌పై భారత ప్రభుత్వం హైఅలెర్ట్.. విమానాశ్రాయాల వద్ద
మంకీ పాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. భారత్ లోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసింది.
మంకీ పాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. భారత్ లోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తుందని అలెర్ట్ గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. అతివేగంగా విస్తరించే ఈ మంకీపాక్స్ సోకకుండా అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది..
రాష్ట్రాల్లోనూ....
భారత్ ప్రభుత్వం బంగ్లాదేశ్ , పాకిస్థాన్ సరిహద్దుల్లో విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో మూడు నోడల్ ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకవార్డులు ఏర్పాటు చేయాలని..అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాలని కేంద్రం అప్రమత్తం చేసింది.
Next Story