Wed Apr 02 2025 14:45:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర కేబినెట్ భేటీ... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ రెండోసారి సమావేశం కానుంది.

కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ రెండోసారి సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
రెండోసారి...
అజెండా ఏమిటన్నది తెలియకపోయినా ముఖ్యమైన విషయాలకు కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపే అవకాశముందని అధికారికవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వందరోజుల ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
Next Story