Mon Dec 23 2024 05:51:00 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ పై ఎన్నికల కమిషన్ బ్యాన్
యూపీ ఎన్నికల్లో రాజాసింగ్ ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది
బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు పోలీసు అధికారులకు ఈసీ నుంచి ఆదేశాలు అందాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్బంగా రాజాసింగ్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.
కేసు నమోదు చేయాలని....
ఈ మేరకు ఎన్నికల కమిషన్ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసింది. యూపీ ఎన్నికల్లో రాజాసింగ్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. రాజాసింగ్ వ్యాఖ్యలు మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని అభిప్రాయపడిన కేంద్ర ఎన్నికల కమిషన్ పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Next Story