Mon Nov 18 2024 03:44:43 GMT+0000 (Coordinated Universal Time)
Election Commission : అది తాత్కాలిక తేదీ మాత్రమే.. అందులో వాస్తవం లేదు
లోక్సభ ఎన్నికల తేదీపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల తేదీపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతాయంటూ తాము ఇచ్చిన తేదీ తాత్కాలికమేనని తెలిపింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు ప్రతిసారి ఒక తేదీని ఎంచుకుంటామని, అందులో భాగంగా ఆ తేదీని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అంతే తప్ప ఏప్రిల్ 16వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని కాదని స్పష్టం చేశారు.
ప్రతి ఎన్నికల్లో...
లోక్ సభ ఎన్నికలను నిర్వహించడానికి ముందు కొన్ని కసరత్తులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్లనే తాత్కాలికంగా ఒక తేదీని నిర్ణయించడం ఎప్పటి నుంచో పరుగుతున్న ప్రాక్టీస్ అని వారు తెలిపారు. అందువల్లనే 16న తాత్కాలిక తేదీగా నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులను సన్నద్ధులను చేసేందుకు ఈ ప్రక్రియను చేస్తామని తెలిపారు. అంతే తప్ప ఏప్రిల్ 16వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతాయని కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఐతే దీనికి కారణం గల లెటర్ మీరు ఇక్కడ చూడవొచ్చు
Next Story