General Elections 2024 schedule: మోగిన ఎన్నికల నగారా షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే?
కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ తో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలోనూ అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ పద్దెనిమిదోతేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఇరవై ఐదో తేదీ నామినేషన్లను స్వీకరించడానికి ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఇరవై ఆరోతేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఇరవై తొమ్మిదో తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
General Elections 2024 schedule:కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఈరోజు షెడ్యూల్ విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లయింది. ఎన్నికల నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మొత్తం దశలలో ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ ప్రారంభమై చివరి దశలో పోలింగ్ ముగియనుంది. దేశ వ్యాప్తంగా కౌంటింగ్ నాడు జరగనుంది.